భారీ ఉగ్రకుట్ర: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ | Gujarat On High Alert After IB Warns of Terrorist Movement In State Border | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి చొరబడ్డ ఆఫ్ఘనిస్తాన్‌ ఉగ్రవాదులు!

Aug 20 2019 12:12 PM | Updated on Aug 20 2019 4:30 PM

Gujarat On High Alert After IB Warns of Terrorist Movement In State Border - Sakshi

గాంధీనగర్‌: భారీ ఉగ్రకుట్రకు పాల్పడేందుకు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటిలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. గుజరాత్‌ సరిహద్దుల నుంచి అఫ్గనిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని ఐబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్‌ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.అఫ్గనిస్తాన్‌ చెందిన నలుగురు ఉగ్రవాదులు ఆ దేశ పాస్‌పోర్టుల ద్వారా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు ధృవీకరించాయి.

ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల ఛాయా చిత్రాలను కూడా నిఘా వర్గాలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌, రాజస్తాన్‌తో పాటు ఉత్తర భారతంలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. భారీ ఉగ్రకుట్రకు వారు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement