వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. బ్యాంకు ఖాతాలు లేని వారికోసం నవంబర్ 26న దీన్ని మొదలుపెట్టామని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
కార్మికులందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించడం, వేతనాలు వాటిలో జమయ్యేలా చూసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల సమన్వయంతో కార్మిక శాఖ తన విభాగాలైన ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ, కార్మిక కార్యాలయాల ద్వారా జిల్లా స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంది.