పెట్రో మంటకు త్వరలో పరిష్కారం

Govt should cut excise duty on petrol and diesel - Sakshi

న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరిగిపోతూ సామా న్యుడికి గుదిబండగా మారుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు తగిన పరిష్కారం కనుగొనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వారంలోనే పలు చర్యలు తీసుకోనుందని వెల్లడించారు.

సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ మేరకు పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ చర్చలు జరుపుతోందని వివరించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ, ముంబైలలో పెరిగిన పెట్రోలు ధర.. తాజాగా చెన్నైలోనూ రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం లీటరుకు రూ.79.79 పలికింది. డీజిల్‌ ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో డీజిల్‌ ధర రూ.68.08.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top