పోక్సో చట్టంతో బాలురకూ రక్షణ!

Govt to amend POCSO Act to make it gender-neutral - Sakshi

సవరణ చేయాలని కేంద్రం యోచన  

న్యూఢిల్లీ: లైంగిక దాడులకు గురవుతున్న బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కఠువా, ఉన్నావ్‌ ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదించిన పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఇటీవల రాష్ట్రపతి ఓకే చెప్పడం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోక్సోకు తాజాగా మరో సవరణ తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top