ఆదాయం కోసం కాదు; ప్రాణాలు కాపాడాలని చేశాం

Government Intention is to Save Lives, Not Earn Revenue : Nitin Gadkari - Sakshi

సాక్షి, ఢిల్లీ : ట్రాఫిక్‌ జరిమానాలను భారీగా పెంచడంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి స్పందించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి జరిమానాలను పెంచలేదనీ, తమకు ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమంటూ బుధవారం స్పష్టం చేశారు. అయితే పెంచిన జరిమానాలను రాష్ట్రాలు వాటి అధికార పరిధికి లోబడి తగ్గించుకోవచ్చన్నారు. మరోవైపు భారీ ట్రాఫిక్‌ జరిమానాలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని గడ్కరీ తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top