అత్యాచారం చేసి.. బావిలోకి తోసేశారు! | girl raped, pushed into well in rajasthan | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేసి.. బావిలోకి తోసేశారు!

Jul 21 2014 1:13 PM | Updated on Jul 28 2018 8:51 PM

రాజస్థాన్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బావిలోకి తోసేశాడు పొరుగింటి వ్యక్తి.

రాజస్థాన్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బావిలోకి తోసేశాడు పొరుగింటి వ్యక్తి.  అయినా, బావిలోపల ఉన్న ఓ మెట్టును పట్టుకుని వేలాడుతూ ఆమె 15 గంటల పాటు తట్టుకుంది. తర్వాత ఆమె ఆరుపులు విన్న కొంతమంది ఆమెను కాపాడారు. భిల్వారాకు చెందిన ఆ బాలిక పొలంలో పనిచేసుకోడానికి వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగింది.

మర్నాడు ఉదయం ఆమె అరుపులు వినడంతో అటుగా వెళ్తున్నవాళ్లు బావిలోకి చూడగా.. అక్కడ బాలిక వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పారిపోయిన ఆ పొరుగింటి వ్యక్తిపై పోలీసులు అత్యాచారం, హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. తాను రాత్రంతా నీళ్లలోనే ఉన్నానని, రాత్రి భారీ వర్షం కూడా కురవడంతో తన అరుపులు ఎవరికీ వినపడలేదని బాధితురాలు చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement