ప్రయాణం మధ్యలో.. భార్యతో డాన్ ఎంజాయ్ | gangster abu salem enjoying with wife in mid journey, claims national media | Sakshi
Sakshi News home page

ప్రయాణం మధ్యలో.. భార్యతో డాన్ ఎంజాయ్

Jul 4 2016 5:01 PM | Updated on Sep 4 2017 4:07 AM

మిడ్ డే పత్రిక ప్రచురించిన అబూసలేం ఫొటో

మిడ్ డే పత్రిక ప్రచురించిన అబూసలేం ఫొటో

మాఫియా డాన్లు అరెస్టయినా, వాళ్లకు కావల్సిన సర్వసుఖాలు అందుతాయన్నది అందరికీ తెలిసిందే.

మాఫియా డాన్లు అరెస్టయినా, వాళ్లకు కావల్సిన సర్వసుఖాలు అందుతాయన్నది అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు జైళ్లే వాళ్లకు ఫైవ్ స్టార్ హోటళ్లలా మారిపోతే, మరికొన్నిసార్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సరిగ్గా ఇలాగే చేస్తున్నాడు గ్యాంగ్స్టర్ అబూ సలేమ్. తరచు విచారణల కోసం లక్నో, ఢిల్లీ వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూంలో తన భార్యను కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మిడ్ డే పత్రిక కొన్ని ఫొటోలను బయటపెట్టింది. అబూసలేమ్ తన భార్య సయ్యద్ బహార్ కౌసర్ (26)తో పాటు పలువురు కుటుంబ సభ్యులను కూడా వెయిటింగ్ రూమ్లలో కలుస్తున్నట్లు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. అక్కడే సెల్ఫోన్లలో మాట్లాడుతూ కూడా కనిపించాడు. ప్రస్తుతం తలోజా జైల్లో ఉన్న అబూసలేంను విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. సరిగ్గా ఇదే అంశాన్ని సలేం తనకు అవకాశంగా మార్చుకున్నాడు. రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూంలలో తన భార్యను, ఇతర కుటుంబ సభ్యులను కలిశాడు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అబూ సలేంను తాను పెళ్లిచేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కౌజర్ గత జూన్ నెలలో కోర్టును కోరింది. మధ్యలో ఒకసారి అతడిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందంటూ మీడియాకు ఎక్కింది. కానీ తాజా ఫొటోలు చూస్తే మాత్రం.. ఇద్దరూ ఎంచక్కా ఉన్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు చెట్టపట్టాలు వేసుకున్నప్పటి ఫొటోలను మిడ్ డే ప్రచురించింది. వీళ్లిద్దరి పెళ్లి ఒక కదులుతున్న రైల్లో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. వాళ్లే అబూసలేంకు సెల్ఫోన్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement