షాపింగ్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం | Fire Breaks Out At Shopping Centre In Mumbais Borivali | Sakshi
Sakshi News home page

ముంబై షాపింగ్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం

Jul 11 2020 8:13 AM | Updated on Jul 11 2020 10:18 AM

Fire Breaks Out At Shopping Centre In Mumbais Borivali - Sakshi

ముంబై (మహారాష్ట్ర):  షాపింగ్ సెంట‌ర్‌లో మంట‌లు చెల‌రేగిన ఘ‌ట‌న ముంబైలోని ప‌శ్చిమ బోరివాలిలో శ‌నివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో 14 ఫైర్ ఇంజ‌న్లు మంట‌ల‌ను అదుపుచేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. అయితే  ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ‌న‌ష్టం లేదా ఆస్తిన‌ష్టం ఏమైనా జ‌రిగాయా అన్నదానిపై వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. గ‌త నెల‌లోనూ ద‌క్షిణ ముంబైలోని నారిమ‌న్ పాయింట్ వ‌ద్ద బ్యాంక్ ఆఫ్ బ‌హ్రెయిన్, కువైట్ కార్య‌క‌లాపాల్లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా క్రాఫోర్డ్ మార్కెట్‌లోని ప‌లు దుకాణాల్లో కూడా మంట‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement