
బండారం బయటకు.. పాక్ ఇప్పుడేమంటుందో
భారత సైనికుడిని తాము చంపలేదంటూ బొంకిన పాకిస్థాన్ బండారం బయటపడింది. పాక్‌కు చెందిన ఉగ్రవాదులే ఆ పనిచేశారని నిరూపించేలా భారత సైన్యం ఆధారాలు కూడా సేకరించింది.
అయితే, మృతదేహంతోపాటు భారత ఆర్మీ పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది. ఘటన స్థలి వద్ద పాక్ మార్కింగ్‌తో ఉన్న ఆహార పదార్థాల పొట్లాలు, గ్రనేడ్లు, రాత్రి పూట చూసే అమెరికా బ్రాండ్‌కు చెందిన టెలిస్కోపులు, రేడియో సెట్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకొని పాక్ ప్రతి స్పందన తెలియజేసిన తర్వాత చెంపపెట్టులా మీడియాకు, అంతర్జాతీయ సమాజానికి చూపించారు. దీనిపై ఇప్పుడు పాక్ ఏం సమాధానం చెబుతోంది చూడాలి.