వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు | Sakshi
Sakshi News home page

వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు

Published Tue, May 3 2016 11:50 AM

వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు - Sakshi

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాయు సేన మాజీ చీఫ్ ఎస్‌పీ త్యాగికి మంగళవారం సమన్లు జారీచేసింది. ఈనెల 5 వ తేది లోగా తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశింది. మరోవైపు ఈ కేసు వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగి సోదరులను మే 6న ఈడీ ప్రశ్నించనుంది.

భారత ప్రభుత్వం మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది. దాని మాతృ సంస్థ ఫిన్‌మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement
Advertisement