రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ తొలగింపు

EC removes NOTA option from Rajya Sabha, Legislative Council polls - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబో– పై వారు ఎవరూ కాదు) గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్‌ ఆప్షన్లకు నోటా వర్తించదని స్పష్టంచేస్తూ ఆగస్టు 21న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే.

లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటాను వినియోగించాలని కోర్టు సూచించింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ తీర్పు చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం మాత్రమే ‘నోటా’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top