‘ప్రాంతీయ భాషలకు అందలం’

DMK Urged Pm To Make Tamil The Official Language - Sakshi

చెన్నై : తమిళం సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన భాషలను అధికార భాషలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ కోరారు. తమిళ భాష అత్యంత ప్రాచీన భాషని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్‌ స్వాగతించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన తమిళ భాషను అధికార భాషగా అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరారు. శ్రీలంక, సింగపూర్‌ దేశాల్లో అధికార భాషగా వెలుగొందుతున్న తమిళ భాషకు భారత్‌లో ఆ హోదా లేదని గుర్తుచేశారు. హిందీ, సంస్కృతాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్న ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల పేర్లకు హిందీలో పేర్లు పెడుతున్నారని, వాటిని తమిళంలోకి తర్జుమా చేయడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన చెన్నై పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ భాషపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తమిళం అత్యంత ప్రాచీన భాషగా ఆయన అభివర్ణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top