నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ | Cyclone Nisarga High Alert In Maharashtra Gujarat Goa | Sakshi
Sakshi News home page

నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌

Jun 2 2020 5:40 PM | Updated on Jun 2 2020 6:28 PM

Cyclone Nisarga High Alert In Maharashtra Gujarat Goa - Sakshi

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి తెలిపారు. కాగా, మహారాష్ట్ర, డయ్యూడామన్‌, గుజరాత్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు.
(చదవండి: ముంబైకి రెడ్‌ అలర్ట్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement