వైరస్‌ మార్పు చెందుతోందా?

COVID-19: ICMR plans to study whether novel coronavirus strain in India - Sakshi

అధ్యయనానికి సిద్ధమౌతోన్న ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్‌) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ యోచిస్తోంది. సార్స్‌–కోవిడ్‌2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడు తుందని దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త వెల్లడించారు. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది)

ఈ అధ్యయనం ద్వారా వైరస్‌ మరింత బలంగా వృద్ధిచెందుతోందా? మరింత త్వరగా వ్యాప్తిచెందుతోందా అనే విషయం తెలుస్తుంది. కరోనా వైరస్‌ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనావేయడానికి కోవిడ్‌–19 రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా(జీఐఎస్‌ఏడీ)ని బట్టి తెలుస్తోందని మరో శాస్త్రవేత్త వెల్లడించారు. (ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం)

ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్‌లోకి వివిధ రకాల కరోనా వైరస్‌లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మూడు రకాలైన వైరస్‌లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఒకటి వూహాన్‌ నుంచి వచ్చిందీ, మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్‌ ఇరాన్‌ నుంచి వచ్చిన రకం. అయితే ఇరాన్‌ నుంచి వచ్చిన వైరస్‌ మాత్రం చైనా వైరస్‌ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్‌ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందనీ, అయితే అన్నిరకాల వైరస్‌లలో ఒకేరకం ఎంజైములు ఉండడం వల్ల టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. ( మూడు జిల్లాల్లో.. 50 శాతానికి పైగా రికవరీ)

భారత్‌లో ఈ వైరస్‌ మూడు నెలలుగా ఉన్నప్పటికీ  త్వరగా మార్పులకు గురికాలేదనీ ఐసీఎంఆర్‌లోని ఎపిడెమాలజీ అండ్‌ కమ్యూని కబుల్‌ డిసీజెస్‌ హెడ్‌ డాక్టర్‌ రమణ ఆర్‌.గంగాఖేద్కర్‌ గతంలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ప్రాణాంతక వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 70 వాక్సిన్‌లు పరీక్షించగా మూడు మాత్రం క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరాయి. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్‌ ప్రజల వినియోగానికి రాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top