ఎస్పీజీ తొలగింపుపై ప్రశ్న లేవనెత్తిన కాంగ్రెస్‌

Congress Raised Question On Removal Of SPG - Sakshi

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ దళం (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ - ఎస్పీజీ) తొలగింపును గురించి లోక్‌సభలో కాంగ్రెస్ ప్రశ్నను లేవనెత్తింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా గాంధీ కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ కవర్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎస్పీజీ తొలగింపును వాయిదా వేసుకోవాలని సోమవారం లోక్‌సభలో అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ ఈ మేరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే వాయిదా నోటీసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను తొలగించి వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భద్రతా పరమైన లోపం కారణంగానే హత్యకు గురయ్యారని జస్టీస్‌ జేఎస్‌ వర్మ కమిషన్ నివేదికను లోక్‌సభలో ఉదహరించింది. ఎస్పీజీ అంశంపై కాంగ్రెస్ తమ నిరసనను లోక్‌సభలో నవంబర్ 25 వరకు చేయనున్నట్లు తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top