ప్లాస్మా థెరఫీకి ప్రత్యేక విభాగం

CM Uddhav Thackeray Says Planning To Provide Remdesivir Favipiravir For Free - Sakshi

టెస్టింగ్‌ సామర్థ్యం పెంపు

ముంబై : కరోనా వైరస్‌ చికిత్సలో వాడుతున్న రెమ్డిసివిర్‌, ఫవిపిరవిర్‌ ఔషధాలను ఉచితంగా రోగులకు అందించాలని యోచిస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో టెస్టింగ్‌ సామర్ధ్యాన్ని పెంచామని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ‘ఛేజ్‌ ద వైరస్‌’ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. డెక్సామెథాసోన్‌ మందును ఇప్పటికే తమ వైద్యులు వాడుతున్నారని, ప్లాస్మా థెరఫీ కూడా మెరుగైన ఫలితాలు అందిస్తోందని అన్నారు. కరోనా చికిత్సలో తాము సోమవారం నుంచి ప్లాస్మా థెరఫీ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు. జూన్‌ 31 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పారు.  కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న క్రమంలో మరో 3 నెలలు పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ పథకాన్ని పొడిగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఇంతటి సంక్షోభ సమయంలోనూ 16,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేశామని, ఇది మహారాష్ట్ర పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి నిదర్శనమి చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top