కుమారుడిపై మండిపడ్డ ములాయం | Chief Minister Akhilesh Yadav Trolled By Father Mulayam | Sakshi
Sakshi News home page

కుమారుడిపై మండిపడ్డ ములాయం

Aug 15 2016 11:01 PM | Updated on Jul 30 2018 8:10 PM

కుమారుడిపై మండిపడ్డ ములాయం - Sakshi

కుమారుడిపై మండిపడ్డ ములాయం

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో విభేదాలు తారస్థాయికి చేరాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీలో మొదటి రెండుస్థానాల్లో ఉన్న అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్, ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన విభేదాలు ములాయం కుటుంబంలో చిచ్చు రగిల్చాయి. మంత్రి, ములాయం సోదరుడు శివ్‌పాల్‌ యాదవ్‌ తాజా ప్రతిపాదన కారణంగా తండ్రీకొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ ఒక దానితో పొత్తు కుదుర్చుకుందామని అఖిలేశ్‌కు సూచించగా, ఇందుకు ఆయన తిరస్కరించారు.

ములాయం మరో సోదరుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ సైతం శివ్‌లాల్‌ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో శివ్‌పాల్‌ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయమంతా ములాయంకు తెలిసింది. శివ్‌లాల్‌ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన ములాయం.. కొడుకుపై మండిపడ్డారు. ‘పార్టీలో శివ్‌పాల్‌ ఒక్కడే నా మాట వింటాడు. ఇప్పుడు అతడు కూడా రాజీనామా చేస్తానంటున్నాడు. అసలు మీరంతా అతణ్ని ఎందుకు అవమానిస్తున్నారు ?’ అంటూ అఖిలేశ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. లక్నోలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో అఖిలేశ్‌తోపాటు ములాయం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement