
రాయ్‌పూర్, సాక్షి : చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ సహా మరో 5 ప్రధాన నగరాల్లో బాణాసంచాను కాల్చడంపై ఆ రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకూ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం అమల్లో ఉన్న సమయంలో వివాహాలు, ఇతర శుభకార్యక్రమాల్లో పటాకులు కాల్చితే తీవ్ర నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
చత్తీస్‌గఢ్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు.. ప్రతి ఏడాది ఈ సమయంలో ఇటువంటి చర్యలు తీసుకుంటామని, ఇదేమీ కొత్తకాదని రాష్ట్ర పర్యావరణ శాఖ తెలిపింది. బాణాసంచాను నిషేధించిన నగరాల్లో రాజధాని రాయ్‌పూర్ సహా, ప్రధాన నగరాలైన బిలాస్‌పూర్, భాలి, దుర్గ్, రాయగడ్, కోర్బా ఉన్నాయి. కాలుష్యనియంత్రణ చట్టం 1981 మేరకు ఆరు ప్రధాన నగరాల్లో బాణాసంచాను నిషేధించినట్లు పర్యావరణ శాఖ ప్రధానకార్యదర్శి అమన్ సింగ్ తెలిపారు.