'ఐఐపీఎమ్ అరిందమ్ చౌదరిపై కేసు నమోదు' | cheating case filed on IIPM | Sakshi
Sakshi News home page

'ఐఐపీఎమ్ అరిందమ్ చౌదరిపై కేసు నమోదు'

May 11 2015 1:46 PM | Updated on Sep 3 2017 1:51 AM

'ఐఐపీఎమ్ అరిందమ్ చౌదరిపై కేసు నమోదు'

'ఐఐపీఎమ్ అరిందమ్ చౌదరిపై కేసు నమోదు'

తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసం చేస్తున్నారంటూ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ సంస్థ (ఐఐపీఎమ్)పై చీటింగ్ కేసు నమోదైంది.

ఢిల్లీ: తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసం చేస్తున్నారంటూ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ సంస్థ (ఐఐపీఎమ్)పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) సోమవారం ఢిల్లీ క్రైం బ్రాంచ్ లో చీటింగ్ కేసు నమోదు చేసింది.  తప్పుడు ప్రకటనలు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో విద్యార్థులను ఐఐపీఎమ్ మోసం చేస్తోందని ఆరోపించింది. ఇందుకు ఐఐపీఎమ్ డీన్ అరిందమ్ చౌదరీని బాధ్యుడిగా పేర్కొంటూ ఢిల్లీ నేరపరిశోధన శాఖ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

విద్యాసంస్థగా ఐఐపీఎమ్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని..  ఇవాళే డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోరుతూ భారీ ప్రకటనలిస్తోందని యూజీసీ స్పష్టం చేసింది. గత 22 నెలల నుంచి ఎంబీఏ కోర్సుకు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.14 లక్షల వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అసలు ఎంబీఏ కోర్సకు సంబంధించి ఐఐఎమ్ కు ఎటువంటి అనుమతిని ఇవ్వలేదని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement