మోదీపై కచ్చితంగా పోటీ చేస్తా : ఆజాద్‌

Chandrashekhar Azad Says He Will Contest Against PM Modi - Sakshi

లక్నో : లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి గనుక బరిలో దిగితే తాను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని  భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చం‍ద్రశేఖర్‌ ఆజాద్‌ పేర్కొన్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో మోదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అదే నియోజక వర్గం నుంచే తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పరిమితికి మించిన బైకులతో ర్యాలీ నిర్వహించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఆయనను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలైన ఆజాద్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.(మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..!)

చదవండి : ఆజాద్‌ విడుదల కూడా రాజకీయమేనా?

ఈ నేపథ్యంలో యూపీ తూర్పు ప్రాంతం తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ నేతలు రాజ్‌ బబ్బర్‌, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి ఆజాద్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. ఈ పరామర్శను రాజకీయం చేయొద్దని కోరారు. ‘ ఇది అహంకార ప్రభుత్వం. యువకుల గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ యోగి సర్కారును విమర్శించారు. ఇక ప్రియాంక తనను కలిసిన అనంతరం ఆజాద్‌ తాను మోదీపై పోటీ చేస్తున్నానని ప్రకటించడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top