‘ముస్లింలకు తిండి దండగ.. వారు పాలిచ్చే గోవులు కాదు’

Assam BJP Leader Prasanta Phukan Objectionable Comments On Muslims - Sakshi

దిస్‌పూర్‌ : సార్వత్రిక ఎన్నికల వేళ అస్సాం బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ ముస్లిం వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారు పాలిచ్చే గోవులు కాదని, అలాంటప్పుడు తిండి దండగే కదా అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ, ముస్లింగ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఫకాన్‌పై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రతిపక్ష నేత దేవవ్రత సైకియా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ముస్లిం ఓట్లతో పనిలేదన్న బీజేపీ ఎమ్మెల్యే.. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేయదని కూడా అన్నారని స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఎమ్మెల్యే ఫకాన్‌ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు.

‘90 శాతం ముస్లింలు మాకు ఓటేయరు. అందుకనే అస్సామీ సామెతను ఉటంకిస్తూ ముస్లిం ఓటర్ల గురించి అలా మాట్లాడాను. పాలు ఇవ్వని గోవులకు తిండి దండగా అనేది నా అభిప్రాయం. వారి ఓట్లతో తమకు అవసరం లేదు. ముస్లిలం ఓట్లతో మా గెలుపోటములు డిసైడ్‌ కావు. ఎందుకంటే 90 శాతం హిందువులు మా పార్టీకి ఓటేస్తారు. అందుకే అలా మాట్లాడాను. అంతేగాని నేను ఎవరినీ ఎవరితో ఎవరికతో పోల్చలేదు’ అని ఫకాన్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఫుకాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలపై గత నాలుగు రోజులుగా దుమారం రేగుతున్నా బీజేపీ ఇంతవరకూ స్పందించలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top