సంక్రాంతి సంబరాల్లో ప్రపంచ కుబేరుడు

Amazon CEO Jeff Bezos Flies Kites With Street Children In Delhi - Sakshi

న్యూఢిల్లీ: అమెజాన్‌ పేరు వినగానే గుర్తొచ్చేది జెఫ్‌ బెజోస్‌. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన ఈసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సంతోషంగా గడిపారు. వీధిలో ఉన్న పిల్లలతో కలిసి జెఫ్ బెజోస్ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. పిల్లలతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి పతంగులు ఎగరవేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి తెల్ల కుర్తాలో వేడుకల్లో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత తనకు బాల్యం గుర్తుకు వచ్చిందని ఆయన చెప్పారు. తన చిన్నప్పుడు ఇలా గాలిపటాలు ఎగరవేశానని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top