మార్చి 31 వరకూ ‘పాన్‌–ఆధార్‌’ గడువు | Sakshi
Sakshi News home page

మార్చి 31 వరకూ ‘పాన్‌–ఆధార్‌’ గడువు

Published Sun, Jul 1 2018 2:59 AM

Aadhaar-PAN Linking Deadline Extended To March 31 Next Year - Sakshi

న్యూఢిల్లీ: పాన్‌కార్డు–ఆధార్‌ అనుసంధానానికి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పొడిగించింది. శనివారంతో గడువు ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 119 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌తో వ్యక్తుల పాన్‌ నెంబర్‌ లింకింగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఇది ఐదోసారి కాగా.. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు. ఆధార్‌తో ఇతర సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీడీటీ తాజా నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకూ గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఐటీ రిటరŠన్స్‌ దాఖలుకు, అలాగే కొత్త పాన్‌ కార్డు కోసం ఆధార్‌ నెంబరును గతేడాది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Advertisement
Advertisement