స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు! | A Youth dies trying to jump off train in Puducherry | Sakshi
Sakshi News home page

స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు!

Mar 26 2016 6:34 PM | Updated on Sep 3 2017 8:38 PM

స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు!

స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు!

తాను దిగాల్సిన స్టేషన్లో ఆగకపోవడంతో ఎక్స్ ప్రెస్ రైళ్లోంచి దూకేసిన యువకుడు చనిపోయాడు.

తాను దిగాల్సిన స్టేషన్లో ఆగకపోవడంతో ఎక్స్ ప్రెస్ రైళ్లోంచి దూకేసిన యువకుడు చనిపోయాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వినోద్(20) అనే విద్యార్థి కోంబాక్కం నుంచి సమీపంలోని గ్రామానికి వెళ్లాలనుకున్నాడు. మంగళూరు-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అతడు దిగాల్సిన స్టేషన్ విల్లనూర్ కాగా, ఆ స్టేషన్లో రైలు ఆగదట. అయితే, తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. రైలు ఆగుతుందని చూశాడు.

కానీ రైలు ఆగకుండా వెళ్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక వినోద్ కంగారులో రైల్లోంచి ప్లాట్ ఫాం పైకి దూకేశాడు. దురదృష్టవశాత్తూ ఆ యువకుడు రైలు చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో కొన్ని సెకన్లలో సంఘటన స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. వినోద్ శరీరం నుజ్జునుజ్జు అయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement