బీజేపీకే ఓటు వేస్తాం | Sakshi
Sakshi News home page

బీజేపీకే ఓటు వేస్తాం

Published Tue, Sep 13 2016 8:59 AM

బీజేపీకే ఓటు వేస్తాం - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని 74 శాతం మంది చెప్పినట్లు మైఓట్.టుడే సంస్థ ప్రకటించింది. తాము నిర్వహించిన సోషల్ మీడియా పోల్‌లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. 10 శాతం మంది ఆప్‌కు, 9 శాతం కాంగ్రెస్, 6 శాతం ఇతరుల వైపు మొగ్గుచూపారని తెలిపింది.

మొత్తం 55,940 మంది ట్వీటర్, ఎంవీటీ(మైఓట్.టుడే) యాప్‌లో తమ అభిప్రాయాల్ని తెలిపారని, 2,40,000 మంది ఈ పోల్‌ను చూశారని ఆ సంస్థ ప్రకటించుకుంది. 23 శాతం మంది ఓటేయగా, వారిలో 80 శాతం దేశంలోని టాప్ 50 నగరాలకు చెందినవారిని పేర్కొంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement