వంద గదులతో నోయిడాలో యూపీభవన్!

వంద గదులతో నోయిడాలో యూపీభవన్! - Sakshi


ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 'భవన్'లన్నింటినీ తలదన్నేలా ఏకంగా వంద గదులతో అత్యాధునికంగా యూపీ భవన్ నిర్మించబోతున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది దేశ రాజధాని సమీపంలోని నోయిడాలో నిర్మితం కానుంది. 44వ సెక్టార్లో ఎకరం విస్తీర్ణంలో ఈ భవనాన్ని కడతారు. ఎక్స్ప్రెస్ వే మీద ఉన్న మహామాయ బాలికల జూనియర్ కాలేజి సమీపంలో ఉన్న స్థలాన్ని ఈ భవనానికి వాడుకోడానికి సీఎం అనుమతినిచ్చారు.దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈ స్థలాన్ని నోయిడా అథారిటీ నుంచి రాజ్య సంపత్తి శాఖ కొనుగోలు చేయనుంది. ఇప్పటికే యూపీ భవన్, యూపీ సదన్ పేరుతో ఉత్తరప్రదేశ్కు రెండు భవనాలున్నాయి. అయితే ఈ రెండూ కూడా సరిపోకపోవడంతో అధికారులు చాలామందికి ఢిల్లీ వెళ్లినప్పుడు మకాం దొరకట్లేదట. అందుకే ఈ కొత్త భవనాన్ని కడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top