పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు! | Zareen Khan Thanks Anushka Sharma After Body Shamed Over Stretch Marks Pic | Sakshi
Sakshi News home page

బాడీ షేమింగ్‌: దాయాల్సిన అవసరం లేదు!

Sep 2 2019 12:18 PM | Updated on Sep 2 2019 12:29 PM

Zareen Khan Thanks Anushka Sharma After Body Shamed Over Stretch Marks Pic - Sakshi

ముంబై : సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ జరీన్‌ ఖాన్‌కు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. రాజస్తాన్‌లో దిగిన ఫొటోలను ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌’ క్యాప్షన్‌తో జరీన్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశారు. జీన్స్‌ బాటమ్‌కు జతగా వైట్‌ క్రాప్‌టాప్‌ ధరించిన ఆ ఫొటోలో.. జరీన్‌ పొట్ట భాగం కనిపించడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘పొట్టపై ఆ కుట్లు ఏంటి? లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్నావా? అసలు అంతలా లావెక్కడం ఎందుకు’ అంటూ ఇష్టారీతిన బాడీ షేమింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ట్రోల్స్‌కు హుందాగా స్పందించిన జరీన్‌...‘ నా పొట్టకు ఏమైందో తెలుసుకోవాలని ఎంతో మంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. 50 కిలోలకు పైగా బరువు తగ్గిన వ్యక్తి పొట్ట సహజంగానే ఇలా ఉంటుంది. ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేయలేదు అలాగే సర్జరీ కూడా చేయించుకోలేదు. నా అసలైన రూపాన్ని, సహజత్వాన్ని మాత్రమే నేను ఇష్టపడతాను. ఒకవేళ లోపాలు ఉన్నా..వాటిని కవర్‌ చేయాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి బాడీ షేమింగ్‌ చేయడం మానేయండి’ తన ఇన్‌స్టాస్టోరీలో రాసుకొచ్చారు. 

ఈ క్రమంలో జరీన్‌ అభిమానులతో పాటు పలువరు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. జరీన్‌ నువ్వు చాలా అందంగా ఉంటావు. ధైర్యవంతురాలివి కూడా. ఎప్పుడు ఇలాగే పర్ఫెక్ట్‌గా ఉండు అంటూ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ జరీన్‌కు బాసటగా నిలిచారు. బొద్దుగా ఉన్ననాటి, బరువు తగ్గిన తర్వాత జరీన్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలను షేర్‌చేస్తూ.. ‘ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరంగా బరువు తగ్గిన మీరు మాకు ఆదర్శం’ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ పోలికలతో ఉండే జరీన్ ఖాన్‌ను సల్మాన్‌ తన ‘వీర్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ పిరియాడిక్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక వీర్‌ తర్వాత సల్మాన్ మరో సినిమా ‘రెడీ’ సినిమాలో అవకాశం దక్కించుకున్న జరీన్‌ హౌజ్‌ఫుల్‌ 4 వంటి పలు చిత్రాల్లో కనిపించారు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జరీన్‌.. గోపీచంద్‌ తాజా సినిమా ‘చాణక్య’తో తెలుగు తెరపై కూడా సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement