పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు యువతి ధర్నా | Young Woman Protest In Front of Pawan Kalyan House | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు యువతి ధర్నా

Aug 31 2017 12:43 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు యువతి ధర్నా - Sakshi

పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు యువతి ధర్నా

జనసేన అధినేత, టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కోట్లలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది.

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత, టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. పవన్‌ పేరు చెబితే చాలు అభిమానులకు పూనకం వస్తుంది. ఆయన్ను కలవడానికి, ఫొటోలు దిగటానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అలాగే ఓ యువతి అర్ధరాత్రి పవన్‌ ఇంటిముందు ధర్నాకు దిగింది. పవన్‌ కళ్యాణ్‌ను వెంటనే కలవాలంటూ హడావిడి చేసింది. లేకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని భీస్మించుకు కూర్చుంది.

హిమాయత్‌ నగర్‌కు చెందిన జ్యోతి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతుంది. ఆమెకు పవన్‌ కళ్యాణ్‌ అంటే విపరీతమైన అభినమానం. పవన్‌ను కలవడానికి పలుసార్లు ప్రశాసన్‌ నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లేది. అయితే ఆమె వెళ్లే సమయానికి పవన్‌ ఇంట్లో లేకపోవడంతో నిరాశతో తిరిగి వచ్చేది.

అయితే బుధవారం రాత్రి మాత్రం  హంగామా చేసింది. పవన్‌ కళ్యాణ్‌ను పిలవండి అంటూ రచ్చ చేసింది. ఆయన్ను చూడకుండా ఇంటికి వెళ్లేది లేదని ధర్నాకు దిగింది. దీంతో పవన్‌ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. గతంలో కూడా జ్యోతి ఇలాగే పవన్‌ ఇంటి ముందు ధర్నాకు దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement