
శ్రియను ఏడిపించిన యువకుడెవరు?
తనను ఒక యువకుడు అవమానించి, ఏడిపించాడని నటి శ్రియ స్వయంగా చెప్పి వాపోయారు.
తనను ఒక యువకుడు అవమానించి, ఏడిపించాడని నటి శ్రియ స్వయంగా చెప్పి వాపోయారు. అయితే ఈ విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రియను ఏడిపించిన ఆ యువకుడు ఎవరన్న అంశం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అసలు ఆ సంగతేంటో చూద్దాం. అందాలభామ శ్రియ తమిళం, తెలుగు భాషల్లో ఒక రౌండ్ కొట్టేసి, ప్రస్తుతం రెండో రౌండ్‌కు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో సంచలన నటుడు శింబుకు జంటగా అన్భానన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇక తెలుగులో బాలకృష్ణకు జంటగా భారీ చారిత్రక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య నటి శ్రియ ఒక ఇంటర్వ్యూ లో తనను ఒక ధనవంతుడైన యువకుడు అవమానించి, ఏడ్చేలా చేశాడని చెప్పారు. తాను అంతగా ఏడుస్తున్నా, అతను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం సముదాయించకుండా పైగా నవ్వుతూ ఎంజాయ్ చేశాడని తెలిపారు. అది భరించలేని తాను పొంగుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక బాత్రూంకు వెళ్లి గట్టిగా ఏడ్చేశానని చెప్పారు. అయితే తనను అవమాన పరిచి ఆవేదనకు గురి చేసిన ఆ యువకుడెవరన్నది శ్రియ వెల్లడించలేదు. ఆమె వేదనతో కూడిన మాటలు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి.