కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్‌  | Without New Producers There Would Be No Survival Says C Kalyan | Sakshi
Sakshi News home page

కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్‌ 

Dec 9 2019 1:18 AM | Updated on Dec 9 2019 1:18 AM

Without New Producers There Would Be No Survival Says C Kalyan - Sakshi

సి. కల్యాణ్‌

‘‘దర్శకుణ్ణి అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, మెళకువలు నేర్చుకున్నాను. అనుకోకుండా నిర్మాత అయ్యాను.  2020లో కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. హీరో ఎవరు? అంటే నేనే అవ్వొచ్చేమో!(నవ్వుతూ)’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్‌. నేడు ఆయన పుట్టినరోజు(డిసెంబరు 9) సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు....

►నెల్లూరులోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు సి. కల్యాణ్‌ అనే ట్యాగ్‌ సంపాదించి ఇచ్చింది ఇండస్ట్రీయే. దర్శకులకు దాసరి నారాయణరావుగారు ఎలా ఉంటారో నిర్మాతలకు డి. రామానాయుడుగారు అలా. రామానాయుడుగారే నాకు స్ఫూర్తి. 

►కొత్త సినిమా నిర్మాతలు లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నవారే సినిమా తీయాలి.. కొత్తవారు సినిమా తీయకూడదంటే ఆరు నెలల్లో ఇండస్ట్రీ మూతపడిపోతుంది. ఇప్పుడున్న నిర్మాతలందరూ ఒకప్పడు కొత్తవారే. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలని చిరంజీవిగారితో ఇటీవలే మాట్లాడాను. ‘నాకు ఏదో పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నట్లుగా ఉన్నావ్‌’ అన్నారాయన. త్వరలోనే ఆ బాధ్యతలు తీసుకుంటారనుకుంటున్నా. 

►వేరే ఇండస్ట్రీల్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియోలు, ఆర్టిస్టులు వేర్వేరుగా ఉంటారు. కానీ టాలీవుడ్‌లో వీరందరూ ఇంటర్‌లింకై ఉన్నారు. ఆ నాలుగు సెక్టార్స్‌ని అండర్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులో సాగదు. ఏదో ఒక రోజు పేలక తప్పదు. ఈ రోజుల్లో ఏడాదికి దాదాపు 280 సినిమాలు విడుదలవుతుంటే... స్టార్స్‌ సినిమాలు వచ్చేది కేవలం 30 నుంచి 50 సినిమాలే. ఒక పెద్ద స్టార్‌ ఏడాదికి ఒక సినిమా చేస్తాడు. అతను ఎన్ని సినిమాలు చేసినా వారికి పనిచేసే స్టాఫ్‌ ఒకరే. మ్యాగ్జిమమ్‌ 40శాతం మారతారు. నేను నోరు విప్పితే చాలామందికి చెమటలు పడతాయి. 

►గతంలో చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరఫున వెళ్లి చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గిల్డ్‌ ఏజెంట్‌ల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ఎవరూ శాశ్వితం కాదు. నేను కూడా. తెలంగాణలో, ఆంధ్రలో వేర్వేరు ప్రభుత్వాలు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గ్రూపులయ్యాయి. చిరంజీవిగారి దగ్గరికి వెళితే ఒక ట్యాగ్‌.. బాలకృష్ణగారి దగ్గరికి వెళితే మరో ట్యాగ్‌.. పవన్‌ కల్యాణ్‌ వద్దకు వెళితో ఇంకో ట్యాగ్‌ కట్టేస్తున్నారు. థియేటర్స్, క్యూబ్‌లు చేతిలో పెట్టుకుని ఉండేవార ంతా ఒక్కటై వ్యాపారం చేస్తున్నారు. ఆ నలుగురి చేతుల్లో థియేటర్స్‌ ఉన్నాయనడం తప్పు. థియేటర్స్‌ని లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తుండటాన్ని తప్పు అనలేం. 

►బాలకృష్ణగారితో నా మూడో సినిమా ‘రూలర్‌’. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో సెటిలైన తెలుగువాళ్ల కథ ‘రూలర్‌’. ఈ సినిమాలో పొలిటికల్‌ యాంగిల్‌ లేదు. బాలకృష్ణ– దర్శకుడు వీవీ వినాయక్‌ కాంబినేషన్‌లో తప్పకుండా మరో సినిమా నిర్మిస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement