నన్నే వద్దంటారా.. అయితే ఓకే! | Why Theres No Salman Khan in Brother Sohails Freaky Ali | Sakshi
Sakshi News home page

నన్నే వద్దంటారా.. అయితే ఓకే!

Aug 23 2016 12:24 AM | Updated on Sep 4 2017 10:24 AM

నన్నే వద్దంటారా.. అయితే ఓకే!

నన్నే వద్దంటారా.. అయితే ఓకే!

చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు, మీ సినిమాలో నటిస్తానని సల్మాన్‌ఖాన్ స్వయంగా బంపర్ ఆఫర్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు, మీ సినిమాలో నటిస్తానని సల్మాన్‌ఖాన్ స్వయంగా బంపర్ ఆఫర్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సల్మాన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అంతేకానీ, వద్దంటారా? చెప్పండి. సల్లూ భాయ్ తమ్ముడు సోహైల్ ఖాన్ మాత్రం అన్నయ్య ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు. నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా సోహైల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఫ్రీకీ అలీ’. ఈ స్క్రిప్ట్ సల్మాన్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో చిన్న పాత్రలో అయినా నటిస్తానని అడిగితే.. ‘‘నీ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌కి సరిపడే క్యారెక్టర్ మా సినిమాలో లేదు.

ఒకవేళ నిన్ను తీసుకుంటే స్టోరీ డిస్ట్రబ్ అవుతుంది. నువ్వు మాకొద్దు’’ అని అన్నయ్యతో సోహైల్ చెప్పారట. క్రేజ్ కంటే కథకు ప్రాముఖ్యం ఇస్తున్న తమ్ముణ్ణి సల్మాన్ అభినందించి, నన్నే వద్దంటారా.. అయితే ఓకే అని సరదాగా అన్నారట. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో సల్మాన్ ఇంకో తమ్ముడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement