దమ్ముంటే చాలు

Vijay Sethupathi signs director Vijay Chander film - Sakshi

కథలో దమ్ముంటే చాలు ఎటువంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉంటారు విజయ్‌ సేతుపతి. అలా హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా డిఫరెంట్‌ రోల్స్‌ చేసి యాక్టర్‌గా మంచి నేమ్‌ అండ్‌ ఫేమ్‌ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఓ చిత్రంలో హీరోగా నటించడానికి అంగీకరించారు. ‘స్కెచ్‌’ ఫేమ్‌ విజయ్‌ చందర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా ఫేవరెట్‌ హీరో విజయ్‌ సేతుపతిని డైరెక్ట్‌ చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది.

విజయ వాహిని ప్రొడక్షన్స్‌ నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్‌ అవుతుంది. డబుల్‌ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు విజయ్‌ చందర్‌. ఈ సినిమా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top