మీరు ఒకే రోజు పుట్టారు.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌లు ఇచ్చారు! | Vijay Devarakonda Wishes To Directors Parshuram And Sandeep Reddy | Sakshi
Sakshi News home page

మీరు ఒకే రోజు పుట్టారు.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌లు ఇచ్చారు!

Dec 25 2018 8:23 PM | Updated on Dec 25 2018 8:46 PM

Vijay Devarakonda Wishes To Directors Parshuram And Sandeep Reddy - Sakshi

విజయ్‌ దేవరకొండకు ఇంతటి క్రేజ్‌ రావడానికి అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం చిత్రాలే కారణం. అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు విజయ్‌. ఈ సినిమాతో విజయ్‌కు యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ చిత్రం తరువాత మళ్లీ గీతగోవిందంతో అందరినీ ఆశ్యర్యపరిచాడు.

ఏమాత్రం అంచనాలు లేకుండా, చిన్న చిత్రంగా రిలీజై రికార్డులను క్రియేట్‌ చేసింది. ఒక చిన్న సినిమా, స్టార్‌స్టేటస్‌ లేని కాస్టింగ్‌తో వందకోట్లు కొల్లగొట్టి షాక్‌ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి. అయితే ఈ అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, గీతగోవిందం డైరెక్టర్‌ పరుశురామ్‌ ఇద్దరి పుట్టిన రోజులు (డిసెంబర్‌ 25) ఒకటే. వీరి బర్త్‌డే సందర్భంగా విజయ్‌ చేసిన ట్వీట్‌వైరల్‌ అవుతోంది. 

‘మీరిద్దరు ఒకే రోజు పుట్టారు. నాకు బ్లాక్‌ బస్టర్‌హిట్‌లు ఇచ్చారు.  థ్యాంక్యూ క్రిస్మస్‌.. సందీప్‌, పరుశురామ్‌ను ఇచ్చినందుకు, ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ షూటింగ్‌ సమయంలో వారితో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశాడు. విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement