‘నోటా’ తొలిరోజు వసూళ్లెంతంటే..? | Vijay Devarakonda Nota First Day Collections | Sakshi
Sakshi News home page

Oct 6 2018 4:18 PM | Updated on Oct 6 2018 4:18 PM

Vijay Devarakonda Nota First Day Collections - Sakshi

సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సంచలనం సృష్టించిన విజయ్‌, మరోసారి భారీ వసూళ్లతో సత్తా చాటాడు.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోటా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 14 కోట్ల వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 కోట్ల వసూళ్లు సాధించిన నోటా, తమిళ నాడులో 2.6 కోట్లు, కర్ణాటకలో 1.55 కోట్లు, అమెరికాలో 1.85 కోట్లు ఇతర ప్రాంతాల్లో 1.2 కోట్ల వసూళ్లు సాదించింది. విజయ్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నాజర్‌, సత్యరాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement