
నోటా చిత్రంలో విజయ్ దేవరకొండ
సాక్షి, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో సెన్సేషన్‌కు తెర లేపాడు. అతను నటిస్తున్న ద్విబాషా చిత్రం టైటిల్‌ను నిర్మాతలు ప్రకటించారు. నోటా అన్న టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసేశారు. ఇంక్ మార్క్ వేసి ఉన్న మధ్య వేలును చూపిస్తున్న విజయ్ దేవరకొండ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది.
ఫస్ట్ లుక్‌తో నోటా పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సాగే సినిమా అన్నది స్పష్టమౌతోంది. సమకాలీనన రాజకీయాలు.. పొలిటికల్ లీడర్ అయిన హీరో తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు అన్నదే చిత్ర ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయంట.
ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయిక కాగా, కీలక పాత్రల్లో సత్యరాజ్, నాజర్‌లు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాను రూపొందిస్తున్నాడు.
My Official Statement.#NOTA pic.twitter.com/KcuUUTpPpy
— Vijay Deverakonda (@TheDeverakonda) 8 March 2018