విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

Vijay Devarakonda And Malavika Mohanan Starrer Hero Launched - Sakshi

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించాడు. ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా కాంత్రికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సెట్స్‌ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు విజయ్‌. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో బహు భాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. విజయ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాతో కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top