యంగ్ హీరోకు చేదు అనుభవం! | Varun Dhawan un happy at bmc elections polling center | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోకు చేదు అనుభవం!

Feb 21 2017 4:47 PM | Updated on Apr 3 2019 6:34 PM

యంగ్ హీరోకు చేదు అనుభవం! - Sakshi

యంగ్ హీరోకు చేదు అనుభవం!

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్కు చేదు అనుభవం ఎదురైంది.

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్కు చేదు అనుభవం ఎదురైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల పోలింగ్ లో ఓటేయడానికి వచ్చిన తనను ఎన్నికల అధికారులు అడ్డుకున్నారని వరుణ్ చెప్పాడు. ఓటర్ల జాబితాలో తన పేరు గల్లంతైనందున తనను పోలింగ్ బూత్ లోకి అనుమతించలేదన్నాడు. గత ఎన్నికల్లో తాను ఓటేశానని, విచిత్రంగా ఇప్పుడు మాత్రం తన ఓటు లేకపోవడం ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపాడు.

తన ఓటు గల్లంతైనప్పటికీ.. స్థానిక ప్రజలందరూ బీఎంసీ ఎన్నికల్లో ఓటేయడానికి రావాలని సూచించాడు. ఓటు వేయడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని చెప్పాడు. వరుణ్, అలియా భట్ ల కాంభినేషన్లో లెటెస్ట్ మూవీ 'బద్రినాథ్ కి దుల్హానియా' ప్రమోషన్లలో బిజీగా ఉన్నా.. ఓటేయడానికి వచ్చిన వరుణ్ నిరాశకు వెనుదిరిగాడు. ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, టీనా అంబాని, సినీనటి రేఖ, అనుష్క శర్మ, టీనా అంబానీ, రణబీర్ కపూర్, తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement