కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్‌ | Vaishakham songs of good - Devi Sri Prasad | Sakshi
Sakshi News home page

కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్‌

Apr 24 2017 12:38 AM | Updated on Sep 5 2017 9:31 AM

కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్‌

కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్‌

హరీష్, అవంతిక జంటగా సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’.



హరీష్, అవంతిక జంటగా సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. డీజే వసంత్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ పాటలు బాగా నచ్చాయి. కంగ్రాట్స్‌ టు వసంత్‌. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్‌ చాలా బాగా నచ్చింది.జయగారి టేకింగ్‌ బాగుంది. ఆడియో, సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వాలి.

రాజుగారు అందరికీ కావాల్సిన మనిషి. జయగారు మాకెంతో ఆత్మీయులు. ‘వైశాఖం’ ఆమె  కెరీర్‌లో చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. ఏ భారతీయ చిత్రం షూట్‌ చెయ్యని కజకిస్తాన్‌లోని అరుదైన లొకేషన్స్‌లో పాటలు తీశారు. అలాంటి రేర్‌ లొకేషన్స్‌ని స్క్రీన్‌పై చూడడం చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ‘వైశాఖం’ పాటలు చూసి, మమ్మల్ని అభినందించిన దేవిశ్రీగారికి కృతజ్ఞతలు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నాం. దేవిశ్రీ చెప్పినట్టుగానే పాటలు, సినిమా పెద్ద హిట్‌ అవుతాయని ఆశిస్తున్నాం’’ అని బి.ఎ.రాజు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement