కొందర్ని నమ్మి మోసపోయాం | Uttara Movie Press Meet | Sakshi
Sakshi News home page

కొందర్ని నమ్మి మోసపోయాం

Jan 7 2020 5:25 AM | Updated on Jan 7 2020 5:25 AM

Uttara Movie Press Meet - Sakshi

తిరుపతి, కారుణ్య, శ్రీరామ్‌

శ్రీరామ్, కారుణ్య కత్రేన్‌ జంటగా తిరుపతి యస్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. రవికుమార్‌ మాదారపు సమర్పణలో శ్రీపతి గంగదాస్, తిరుపతి యస్‌.ఆర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి యస్‌.ఆర్‌ మాట్లాడుతూ–‘‘ఉత్తర’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. కానీ, థియేటర్స్‌ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇందులో మా తప్పులూ లేకపోలేదు. సినిమా రిలీజ్, ప్రచార విషయాల్లో కొందర్ని నమ్మి మోసపోయాం. పాజిటివ్‌ టాక్‌ వస్తున్నప్పటికీ థియేటర్స్‌ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో కొందరి నిజస్వరూపాలు తెలిశాయి. మంచి సినిమాలను బతికించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు బాగాలేదనలేదు. మా సినిమాను ఇండస్ట్రీ పెద్దలు చూసి సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీరామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement