
అవి పనికిమాలిన గాసిప్పులు!
తనను స్టార్‌ని చేసిన దక్షిణాది సినిమాను దాదాపుగా పక్కన పెట్టేసి.. పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టేసింది గోవా భామ నా. ప్రస్తుతం ఆమె సైఫ్ అలీఖాన్‌కి జోడీగా ‘హ్యాపీ ఎండింగ్’
తనను స్టార్‌ని చేసిన దక్షిణాది సినిమాను దాదాపుగా పక్కన పెట్టేసి.. పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టేసింది గోవా భామ నా. ప్రస్తుతం ఆమె సైఫ్ అలీఖాన్‌కి జోడీగా ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రంలో నటిస్తోంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే... ఈ చిత్ర దర్శకుడు రాజ్ నిడుమోరు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఇలియానా చనువుగా తిరుగుతున్నారని బాలీవుడ్ టాక్. దీనిపై బాలీవుడ్‌కి సంబంధించిన కొన్ని పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. వీటిపై ఇల్లూ బీబీ రుసరుసలాడిపోతున్నారట. ఇలాంటి పలికిమాలిన గాసిప్పుల గురించి మాట్లాడటం కూడా వృథా అని ఘాటుగా స్పందించారట.