
ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు 15న ఓ ఇంపార్టెంట్ అప్‌డేట్ ఇవ్వనున్నారు.
తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోనూ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Get Ready for AN ENTHRALLING SPACE ADVENTURE 🚀👨🚀🌌 🛰
— First Frame Entertainments (@FirstFrame_Ent) 12 August 2018
Unveiling 'Title' & 'Release Date' On August 15th 🇮🇳 at 9:30 AM.@IAmVarunTej @aditiraohydari @Itslavanya @gnanashekarvs @FirstFrame_Ent #SankalpReddy @YRajeevReddy1 @DirKrish @prashanthvihari pic.twitter.com/EZp215JIei