కరోనాతో హీరో తండ్రి మృతి | Tollywood Actor Sree Father Last Breath Cause Of Covid 19 | Sakshi
Sakshi News home page

‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ ఇంట్లో విషాదం

Jul 9 2020 8:01 AM | Updated on Jul 9 2020 9:17 AM

Tollywood Actor Sree Father Last Breath Cause Of Covid 19 - Sakshi

సాక్షి, విజయవాడ‌: టాలీవుడ్‌ నటుడు, ‘ఈ రోజుల్లో ఫేం’ శ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్‌ మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) బారిన పడి మృతి చెందారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా ప్రముఖ డైరెక్టర్‌ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు లవ్‌ సైకిల్, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ తదితర‌ సినిమాల్లో నటించాడు.


ఈ రోజుల్లో ఫేం శ్రీ
ఇదిలా ఉండగా.. సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మరణించారు. అదే విధంగా పలువురు బుల్లితెర నటులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామికి కరోనా సోకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement