breaking news
ee rojullo movie
-
ఈ తెలుగు హీరో గుర్తున్నాడా? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
ఇండస్ట్రీలో హీరోగా చేసి హిట్ కొట్టడం గొప్పకాదు. వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం గొప్ప. అలా చేయలేకే చాలామంది హీరోలు కనుమరుగవుతున్నారు. అలాంటి ఓ హీరోనే ఇతడు. 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి తీసిన తొలి మూవీ హీరో ఇతడే. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ ఇతడెవరు? ఇప్పుడేం చేస్తున్నాడు?(ఇదీ చదవండి: 'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?)పైన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మంగం శ్రీనివాస్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. 'ఈ రోజుల్లో' హీరో శ్రీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2012లో ఈ సినిమా రిలీజైంది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే హీరోగా చేసిన శ్రీ కూడా చాలానే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. కాకపోతే సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్ల కేవలం మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయాడు.'ఈ రోజుల్లో' సినిమా తర్వాత శ్రీ.. రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్.. ఇలా మూడునాలుగేళ్లలో 12 వరకు మూవీస్ చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. శ్రీ కూడా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పాడు. హీరోగా చేస్తున్న టైంలో తాహతుకు మించిన పనులు చేశానని, తన చిత్రాలు రిలీజ్, షూటింగ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే సొంత డబ్బులు ఇచ్చానని.. అలా ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడు. ఇది శ్రీ కుటుంబ బిజినెస్. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి ఇతడికి వచ్చింది. 2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోవడంతో ఈ బిజినెస్‌లోకి వచ్చానని శ్రీ చెప్పాడు. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో ఉందని అన్నాడు. పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్నానని, భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుందని కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తొలి సినిమాతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఈ హీరో.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. 'అరోమలే' ఓటీటీ రివ్యూ) -
ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు లాయర్‌గా!
ఈమె తెలుగమ్మాయి. సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. త్రిషకు ఫ్రెండ్‌గా నటించి సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది హీరోయిన్ గా ఓ మూవీలో నటించే బంపరాఫర్ అందుకుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలొచ్చినా అవి సక్సెస్ కాలేదు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేష్మా రాథోడ్. ఎవరనేది కచ్చితంగా గుర్తురాకపోవచ్చు. సరే అక్కడికే వచ్చేద్దాం. వెంకటేశ్-త్రిష 'బాడీగార్డ్' సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా ఈమె నటించింది. అదే ఏడాది రిలీజైన 'ఈ రోజుల్లో' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కథానాయికగా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. (ఇదీ చదవండి: ఇరకాటంలో రష్మిక.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్) 'ఈ రోజుల్లో' తర్వాత జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ) తదితర చిత్రాలు చేసింది గానీ ఈమె వీటిలో ఒక్కటి కూడా కలిసి రాలేదు. దీంతో 2017 తర్వాత పూర్తిగా నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీ పార్టీలో చేరింది. దీనితోపాటే లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. నటిగా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన రేష్మా.. పొలిటికల్, లాయర్ గా మాత్రం తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా పదోన్నతి పొందింది. ఇకపోతే అప్పట్లో ఒకలా ఉన్న రేష్మా.. ఇప్పుడు చాలావరకు మారిపోయి కనిపించింది. దీంతో ఆమెని కాసేపు గుర్తుపట్టలేకపోయారు. ఏదేమైనా ఓ తెలుగు హీరోయిన్ సుప్రీం కోర్టులో లాయర్ కావడం గ్రేట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) View this post on Instagram A post shared by ReshmaRathore (@reshmarathore) -
కరోనాతో హీరో తండ్రి మృతి
సాక్షి, విజయవాడ: టాలీవుడ్ నటుడు, ‘ఈ రోజుల్లో ఫేం’ శ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ మహమ్మారి కరోనా(కోవిడ్-19) బారిన పడి మృతి చెందారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా ప్రముఖ డైరెక్టర్ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు లవ్ సైకిల్, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ తదితర సినిమాల్లో నటించాడు. ఈ రోజుల్లో ఫేం శ్రీ ఇదిలా ఉండగా.. సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మరణించారు. అదే విధంగా పలువురు బుల్లితెర నటులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా సోకింది. -
‘ఐ లవ్ హైదరాబాద్’ : రేష్మా రాథోడ్
ఏడో తరగతిలో హైదరాబాద్‌కు విహారిగా వచ్చింది. సిటీలోని ప్లేస్‌లన్నీ చుట్టేసి రిటర్న్ అయింది. కట్ చేస్తే.. ఐదేళ్ల కిందట మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఈసారి విహారిగా కాక తారకలా వచ్చి వెండితెరపై తళుక్కుమంది. ‘ఈ రోజుల్లో’ అందంతో అంతకుమించిన అభినయంతో అందరి మన్ననలు అందుకుంటోంది హీరోయిన్ రేష్మా రాథోడ్. సిటీలో చక్కర్లు కొట్టకున్నా.. ఇక్కడి షూటింగ్ స్పాట్స్ చూసి సిటీపై మనసైందని చెబుతోంది. మస్తీ షహర్‌తో ఐదేళ్లుగా ఉన్న అనుబంధాన్ని ‘ఐ లవ్ హైదరాబాద్’ అంటూ ‘సిటీప్లస్’తో పంచుకుంది. మాది ఖమ్మం. నేను లా చదువుకున్నాను. మూవీస్ కెరీర్‌కి ముందు మోడలింగ్ కూడా చేశాను. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. భరతనాట్యం అంటే ఆసక్తి. అలా డ్యాన్సింగ్ నుంచి మోడలింగ్‌కు వెళ్లాను. తర్వాత యాడ్స్‌లో నటించాను. నా ఫొటోలు చూసిన డెరైక్టర్ మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాలో చాన్స్ ఇచ్చారు. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చాను. అందుకే హైదరాబాద్ అనగానే నాకు షూటింగ్ గుర్తొస్తుంది. నాకు రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. అదే తొలిసారి.. నేను ఏడో తరగతిలో ఉండగా విహారయాత్ర కోసం మొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను. చార్మినార్, గోల్కొండ ఇలా సిటీలోని అన్ని ఫేమస్ స్పాట్స్ చూశాను. అప్పుడు ట్యాంక్‌బండ్‌పై ఫ్రెండ్స్‌తో కలసి చేసిన ఎంజాయ్మెంట్ ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. షూటింగ్స్ కోసం తప్ప సిటీలో బయట తిరిగింది తక్కువే. ఎక్స్కర్షన్ కోసం వచ్చినప్పుడే ఎక్కువ తిరిగానేమో. ఇప్పుడు షూటింగ్‌తోనే టైం అయిపోతుంది. షార్ట్ బ్రేక్స్‌లో చుట్టూ ఉన్న నేచర్‌ని ఎంజాయ్ చేస్తుంటాను. ఎక్కువగా ఇంట్లో ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే తెలిసింది.. ఈ రోజుల్లో సినిమా మొత్తం హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో తీశారు. అప్పుడే సిటీని దగ్గరగా చూశా. బొటానికల్ గార్డెన్, ఔటర్ రింగ్ రోడ్డు ఇలా షూటింగ్ అంతా ఇక్కడిక్కడే జరిగింది. సిటీ గురించి ఇక్కడ ఉన్నవాళ్ల కన్నా.. వేరే వాళ్లు చె బుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది. బయట నుంచి వచ్చిన హీరోయిన్స్ హైదరాబాద్ కల్చర్ బాగుంటుంది, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారని చెబుతుంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. అందుకే ఇక్కడి నుంచి షిప్ట్ అవ్వాలనే ఆలోచన లేదు. ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. వెల్ డెవలప్డ్ సిటీ. ఈ రేంజ్లో ఇంకో సిటీ డెవలప్ కావాలంటే కష్టమే. రెయిన్ రెయిన్బో.. ఔటర్‌రింగ్ రోడ్ మీద ఒక స్వీట్ మెమరీ ఎప్పటికీ మరిచిపోలేను. ఈ రోజుల్లో షూటింగ్ జరుగుతోంది. సన్నగా వర్షం కురుస్తోంది. ఆకాశంలో పెద్ద రెయిన్ బో కనిపించింది. ఎప్పుడు రెయిన్బో కనిపించిన బిల్డింగ్లు, చెట్లు ఉండటంతో మొత్తం చూసే అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఫస్ట్‌టైం ఫుల్ రెయిన్ బో చూశాను. సీన్ అదిరిపోయేలా ఉండటంతో ఓ షాట్ షూట్ చేశారు. ఆ సినిమాలో బైక్ సాంగ్‌లో ఆ సీన్ కనిపిస్తుంది. లైట్స్ అండ్ క్రాకర్స్.. షాపింగ్ పెద్దగా చెయ్యను. ఇక్కడి రెస్టారెంట్స్‌లో ఓరీస్ అంటే చాలా ఇష్టం. పానీపూరి, పునుగులు అంటే ఇష్టం. ఐమాక్స్‌లో ఓసారి చాట్ తిన్నాను. ఆ టేస్ట్ ఎప్పటికీ మరచిపోలేను. ఆ స్ట్రీట్ కూడా భలేగా ఉంటుంది. ఐదారేళ్లకోసారి నా బర్త్‌డే దీపావళికి ముందు వెనుక రోజుల్లోనే వస్తుంది. అప్పుడు లైట్స్ అండ్ క్రాకర్స్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటా. ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఇక ఈ రోజు నా పుట్టిన రోజును షూటింగ్ స్పాట్లోనే చేసుకుంటున్నాను. రేష్మా రాథోడ్


