సంగీత్‌లో హీరోయిన్‌ అర్చన ఆటాపాట

Telugu Actress Archana Marriage Sangeet Function - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరోయిన్‌ అర్చన(వేద) పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు. బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌లో అర్చన వివాహం జరగనుంది. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

నేను సినిమాతో 2004లో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రతిభ చాటుకుంది. టీవీల్లో పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top