తమిళ దర్శకులకు పరిపక్వత లేదు | Tamil directors do not have the maturity | Sakshi
Sakshi News home page

తమిళ దర్శకులకు పరిపక్వత లేదు

Mar 30 2014 12:35 AM | Updated on Sep 2 2017 5:20 AM

తమిళ దర్శకులకు  పరిపక్వత లేదు

తమిళ దర్శకులకు పరిపక్వత లేదు

తమిళ దర్శకులకు పరిపక్వత లేదని మలయాళ నటి కనిక విరుచుకుపడ్డారు. పెళ్లరుున తరువాత కూడా అశ్లీలంగా నటించమని అడుగుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

తమిళ దర్శకులకు పరిపక్వత లేదని మలయాళ నటి కనిక విరుచుకుపడ్డారు. పెళ్లరుున తరువాత కూడా అశ్లీలంగా నటించమని అడుగుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ భామ తమిళంలో ఫైవ్ స్టార్, ఆటోగ్రాఫ్, వరలారు తదితర చిత్రాల్లో నటించారు. మలయాళంలో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ అమ్మడు ఆ మధ్య వివాహం చేసుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా వున్నా ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చినా అంగీకరించలేని పరిస్థితి అంటున్నారు. దాని గురించి కనిక మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేదానన్నారు. అయితే ఇప్పుడలాంటి కోరిక లేదన్నారు. పేరు కోసం చిత్రాలు చేయాలనే అవసరం లేదని పేర్కొన్నారు. మంచి వైవిధ్యభరిత పాత్రలు అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నానన్నారు.
 
 తన కుటుంబ సభ్యుల ఆదరణ తనకెప్పుడూ ఉంటుందని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే వివాహం అయిన హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారని తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా పెళ్లరుుందన్న ఆలోచన కూడా లేకుండా అరకొర దుస్తులు ధరించమని అడుగుతున్నారని ఆరోపించారు. చీర ధరించి నటిస్తానంటే వారి నుంచి బదులే లేదని చెప్పారు. అయితే మలయాళంలో అలాంటి పరిస్థితి లేదని అక్కడ వయసు మళ్లిన నటీమణులైనా కథానారుుకగా అవకాశాలిస్తారని తెలిపారు. మలయాళ దర్శకుల్లో పరిపక్వత ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు నటి కనిక.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement