నా భార్య మానసిక రోగి! | Suchitra going through certain emotional condition | Sakshi
Sakshi News home page

నా భార్య మానసిక రోగి!

Mar 4 2017 11:56 PM | Updated on Sep 5 2017 5:12 AM

నా భార్య మానసిక రోగి!

నా భార్య మానసిక రోగి!

‘‘నా భార్య మానసిక రోగి’’ అని గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్‌ పేర్కొన్నారు.

‘‘నా భార్య మానసిక రోగి’’ అని గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్‌ పేర్కొన్నారు. పలువురు సినీప్రముఖుల ఆంతరంగిక విషయాలను సోషల్‌ మీడియా ద్వారా బయట పెడుతూ గాయని సుచిత్ర  కోలీవుడ్‌లో అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య హీరో ధనుష్‌ తనతో తప్పుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఎప్పుడు.. ఎవరితో చెప్పడానికైనా సిద్ధమేనని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారామె.

ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత హీరో ధనుష్‌– హీరోయిన్‌ త్రిష, సంగీతదర్శకుడు అనిరుద్‌– హీరోయిన్‌ ఆండ్రియా, హీరో రానా–హీరోయిన్‌ త్రిష, బుల్లితెర నటి డీడీ (దివ్యదర్శిని) ఒక యువకునితో క్లోజ్‌గా ఉన్న దృశ్యాలను సుచిత్ర ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చారు. అలాగే వేరే వ్యక్తుల నీలి చిత్రాలను పోస్ట్‌ చేసి, రాయలేని వ్యాఖ్యలను పొందుపరిచారు. అదే విధంగా ‘వేచి చూడండి.. మరికొందరి తారల రాసలీలలను బయట పెడతా’ అంటూ పోస్ట్‌ చేయడం చిత్రపరిశ్రమలో మరింత కలకలం సృష్టించింది.

ఈసారి గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్‌ స్పందిస్తూ.. ఆ ఫొటోలకు, తన భార్య సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, సంబంధించిన వారికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాయని సుచిత్ర తన భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. అయితే అది వదంతి మాత్రమేనని కార్తీక్‌కుమార్‌ కొట్టిపారేశారు. అదే విధంగా తన భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోందని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తాజాగా సుచిత్ర ట్విట్టర్‌లో మరో సంచలన వ్యాఖ్యలను పోస్ట్‌ చేశారు.

ధనుష్, అనిరుద్‌తో పార్టీలో పాల్గొన్నానని, అప్పుడు తాను సేవించిన పానీయంలో మద్యం కలిపారని, ఆ తరువాత జరిగిన ఘోర అనుభవం గురించి చెప్పలేనని సుచిత్ర పేర్కొనడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు చేసింది ‘నేను కాదు, నా ట్విట్టర్‌ను హ్యాక్‌ చేసి ఎవరో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నామ’ని సుచిత్ర పేర్కొన్నారు. మొత్తం మీద సుచిత్ర ప్రవర్తన కోలీవుడ్‌ని ఒక కుదుపు కుదిపేస్తోందనే చెప్పాలి. ధనుష్, అనిరుద్, త్రిష, ఆండ్రియా తదితరులు సుచిత్ర చేసిన వ్యాఖ్యలకు, పెట్టిన ఫొటోలకు స్పందించలేదు. కాగా.. సుచిత్ర ట్విట్టర్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేరని, ఆ విధంగా ఆమె పాస్‌వర్డ్‌ పెట్టుకున్నారని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం. మరి.. సుచిత్ర ట్విట్టర్‌ హ్యాక్‌ అయ్యిందా? ఏది నిజం? ఏది అబద్ధం?

ఇదిలా ఉంటే.. తన అనుమతి లేకుండా ట్విట్టర్‌ ఎకౌంట్‌ను ఇతరులు అనుసరించలేని విధంగా సుచిత్ర సెట్‌ చేసుకున్నారు.  
– ‘సాక్షి’ చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement