మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు | Student of the Year 2 Crosses Rs 50 Crore | Sakshi
Sakshi News home page

మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు

May 17 2019 3:45 PM | Updated on May 17 2019 3:45 PM

Student of the Year 2 Crosses Rs 50 Crore - Sakshi

టైగర్‌ ష్రాఫ్‌ తాజా సినిమా స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

ముంబై : టైగర్‌ ష్రాఫ్‌ తాజా సినిమా స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్లు మాత్రంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా ఇండియాలో మొదటి వారంలో రూ. 57.90 కోట్ల కలెక్షన్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. రెండో వారం వసూళ్లు ఈ సినిమాకు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

గతేడాది విడుదలైన ‘బాగీ2’ సినిమా మొదటి వారంలోనే వంద కోట్లు పైగా (రూ. 112.85 కోట్లు) సాధించి టైగర్‌ ష్రాఫ్‌ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ‘బాగీ’ సినిమా తొలి వారంలొ రూ. 59.72 కోట్లు రాబట్టింది. కరణ్‌ జోహార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే, తార నటించారు. పునీత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement