నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

Starts From today International Film Festival in Tamil Nadu - Sakshi

తమిళనాడు ,పెరంబూరు: అంతర్జాతీయ  6వ చిత్రోత్సవాలు బుధవారం నుంచి తిరువణ్ణామలైలో జరగనున్నాయి. తమిళనాడు మర్పోక్కు ఎళుత్తాళర్‌ కళైంజర్‌ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ చిత్రోత్సవాల్లో 12 దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవాలు తిరువణ్ణామలై, సంఘం రోడ్డులోని ఒక థియేటర్‌లో కలెక్టర్‌ కేఎస్‌ కందస్వామి చేతుల మీదగా ప్రారంభం కానున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రచయితలు పాల్గొననున్నారు.

అలాగే ఈ చిత్రోత్సవాల్లో ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న గ్రీస్‌బుక్‌ చిత్రంతో పాటు, పలు అవార్డులను అందుకున్న మలయాళ చిత్రం కుంబళంగి నైట్స్, పబ్లిక్‌ లైబ్రరీ అనే అమెరికా చిత్రం, కోల్డ్‌వార్‌ అనే హంగేరి చిత్రం, టులెట్‌ అనే తమిళ చిత్రం 12 దేశాలకు చెందిన 23 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అనంతరం వాటి గురించి చర్చావేదిక ఉంటుంది. ఈ ఉత్సవాల్లో తమిళనాడు ముర్పోక్కు ఎళుత్తాలర్‌ కలైంజర్‌ సంఘం గౌరవ అధ్యక్షుడు తమిళ్‌సెల్వన్, అరమ్‌ చిత్ర దర్శకుడు గోపినయినార్, మధురై కమ్యూనిస్ట్‌ పార్టీ ఎంపీ వెంకటేశన్‌ తదితరులు పాల్గొననున్నారు. అదే విధంగా నటి రోహిణి, దర్శకుడు రాజుమురుగన్, లెనిన్‌భారతి, బ్రహ్మకుమారి సెల్వరాజ్‌ తదితరులు పాల్గొంటారని సంఘం రాష్ట్ర ఉప కార్యదర్శి ఎస్‌.కరుణ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top