చూడరా కాళీ ఆట | SPB sings for Rajinikanth in Petta | Sakshi
Sakshi News home page

చూడరా కాళీ ఆట

Dec 8 2018 1:02 AM | Updated on Sep 12 2019 10:40 AM

SPB sings for Rajinikanth in Petta - Sakshi

‘పాక్కదాన పోర ఇంద కాళీయోడ ఆట్టత్త...’ అంటూ డ్యాన్స్‌ చేస్తున్నారు రజనీకాంత్‌. అంటే ‘చూడబోతున్నావు కదా ఈ కాళీ ఆట..’ అని అర్థం. రజనీ లేటెస్ట్‌ చిత్రం ‘పేట్టా’లో టైటిల్‌ సాంగ్‌ ఇలానే స్టార్ట్‌ అవుతుంది. ‘మరణ మాస్‌...’ అనే పదాలతో సాగే ఈ మాస్‌ సాంగ్‌ విని రజనీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. సంగీత దర్శకుడు అనిరు«ద్‌ స్వరపరచిన ఈ మాస్‌ సాంగ్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత రజనీకాంత్‌కు ఎస్పీబీ పాడిన పాట ఇది. ఈ పాటలో సూపర్‌స్టార్‌ సూపర్‌ ఎనర్జీతో స్టెప్పులేశారని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ పాటలో కొన్ని లైన్స్‌ని మాత్రమే ఎస్పీబీ పాడారని కొందరు బాధపడుతున్నారు.

రజనీ వీరాభిమానులైతే సోషల్‌ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఎస్పీబీ స్పందిస్తూ– ‘‘చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కి పాట పాడినందుకు ఆనందంగా ఉంది. ఈ పాటలో నా భాగం కొంత మాత్రమే. అయినా నాకేం ఇబ్బంది లేదు. ‘పేట్టా’ టీమ్‌ నా వాయిస్‌ కావాలనుకున్నారు. పాట పాడించటానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట్టా’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. త్రిషా, సిమ్రాన్‌ కథానాయికలు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement