కలిసిపోయారు

Simbu joins ex-girlfriend Hansika on Maha shoot - Sakshi

తమిళ నటుడు శింబు, హన్సిక అప్పట్లో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. తాజాగా మళ్లీ కలిశారు. కలిసిపోయారా? అని ఆశ్చర్యపడకండి.  ఈసారి కలిసింది  ప్రొఫెషనల్‌గా మాత్రమే. హన్సిక తాజా చిత్రం ‘మహా’లో శింబు ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో శింబు జాయిన్‌ అయ్యారు. హన్సిక చేస్తున్న ఈ తొలి ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీ ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. యుఆర్‌ ఉజ్వల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు ఫ్లాష్‌బ్యాక్‌ భాగంలో మెరుస్తారట. ప్రస్తుతం ఫారిన్‌లో శింబు, హన్సికలపై ఓ సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి శింబూని హన్సికనే ఒప్పించారని దర్శకుడు ఇటీవల పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top